No results found

    Sweet Paratha: సింపుల్ గా స్వీట్ పరాటా పిల్లల కోం ఇలా చేసేయండి, రుచి అదిరిపోతుంది


    Sweet Paratha: పంచదారతో చేసిన పరాటా రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పరాటాను మెత్తగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము ఫాలో అయిపోండి.

    స్వీట్ పరాటా రెసిపీ
    స్వీట్ పరాటా రెసిపీ

    శీతాకాలంలో వేడి వేడి పరోటాలు తింటే ఆ కిక్కే వేరు. పెద్దలు ఏ కూరతోనైనా పరోటాను తింటూ ఉంటారు. కానీ పిల్లలకు మాత్రం తీపిగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. పిల్లల కోసం స్వీట్ పరాటా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. దీన్ని చాలా త్వరగా వండేయవచ్చు. పిల్లలకు దీన్ని చేసి పెడితే బ్రేక్ ఫాస్ట్ తో సహా లంచ్ బాక్స్ రెసిపీగా కూడా వాడవచ్చు. ఇక్కడ మేము సింపుల్ పద్ధతిలో స్వీట్ పరాటా ఎలా చేయాలో ఇచ్చాము. ఈ చిట్కాల ద్వారా పరాటాను చేసి చూడండి.

    స్వీట్ పరాటా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

    గోధుమ పిండి - రెండు కప్పులు

    బెల్లం తురుము - అర కప్పు

    ఉప్పు - పావు స్పూను

    నెయ్యి - రెండు స్పూన్లు

    స్వీట్ పరాటా రెసిపీ

    1. ఈ పరాటా చేయడానికి చపాతీ పిండిని ఎలా కలుపుకుంటా అలా కలుపుకోండి.
    2. ఇప్పుడు స్టవ్ మీ పెనం పెట్టి వేడి చేయండి. పైన నెయ్యి వేయండి.
    3. మరోపక్క చపాతీ పిండి నుంచి చిన్న ముద్దను చూసి చిన్న పూరీలా ఒత్తుకోండి.
    4. అందులో బెల్లం తురుమను చల్లి చపాతీని మడత పెట్టి మళ్లీ ఒత్తండి.
    5. దాన్ని పరాటాలా ఒత్తి పెనం మీద ఉన్న నెయ్యిలో కాల్చాలి. దీన్ని రెండు వైపులా కాల్చుకుంటే పరాటా రెడీ అయినట్టే.

    పరాటా మెత్తగా రావాలంటే చిట్కాలు

    మెత్తగా, టేస్టీగా ఉండే స్వీట్ పరాటా కావాలంటే దీని కోసం కొన్ని చిట్కాలను పాటించండి. పిండిని కలిపేటప్పుడు నీటికి బదులుగా పాలను ఉపయోగించండి. మీరు పిండిని కలుపుకున్నాక పావుగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేయండి. మూతకు బదులు తడిగా ఉండే కాటన్ వస్త్రాన్ని వాడితే మంచిది.

    పరాటాను కాల్చేటప్పుడు ముందుగా పెనం వేడెక్కేలా చూసుకోవాలి. తక్కువ మంట మీద లేదా ఎక్కువ మంట మీద పరాటాను కాల్చకూడదు. మంట ఎప్పుడూ మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. మంచి రుచి కోసం నెయ్యిలో తయారు చేసుకోవాలి.

    పరాటాలు కేవలం మన దేశంలోనే కాదు నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, సింగపూర్, థాయిలాండ్, మారిషస్, ట్రినిడాడ్, మయన్మార్ వంటి దేశాల్లో కూడా వీటిని తింటారు. మన దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ పరాటాలను తినే అలవాటు ఉంది.

    ఈ పరాటా ఆరోగ్యానికి కూడా మేలే చేస్తుంది. దీనిలో మనం బెల్లాన్ని వినియోగించాము. కాబట్టి దీన్ని తినడం వల్ల ఐరన్ లోపం రాకుండా ఉంటుంది. తీపిదనం కోసం పంచదార కన్నా బెల్లంమ్మీదే ఆధారపడడం మంచిది.


    Post a Comment

    Previous Next

    نموذج الاتصال