No results found

    PV Sindhu Diet Secrets: డైట్ సీక్రెట్స్ బయటపెట్టిన పీవీ సింధు! ప్రతి పూటలో ప్రోటీన్‌ను ఎలా తీసుకుంటుందో తెలుసా?

     

    PV Sindhu Diet Secrets: ఎప్పుడూ ఫిట్‌గా, అందంగా కనిపించే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఎలాంటి ఆహారం తింటుందో తెలుసుకోవాలని ఉందా? గుడ్ల నుంచి పప్పు పనీర్ వరకూ ప్రతి పూట తన ఆహారంలో ప్రోటీన్‌ను ఎలా చేర్చుకుంటుందో ఆమె వివరించింది. నచ్చితే మీరు ఫాలో అయిపోండి.

    భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
    భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (Instagram)

    పీవీ సింధు గురించి తెలియని వారంటూ ఉండరు. బాడ్మింటన్ ఆటతో పాటు కొన్ని రకాల యాడ్లు, సోషల్ మీడియా పోస్టులతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా ఫిట్‌గా, అందంగా కనిపిస్తుంది. పీవీ సింధు ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండటానికి, ఆకర్షణీయమైన చర్మ సౌందర్యాన్ని మెయింటేన్ చేయడానికి ఏం తింటారు, తన ఆహారంలో ఎలాంటి ప్రొటీన్‌ను చేర్చుకుంటారు. ఏ సమయంలో ఏం తింటారు వంటి ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్ ప్రియులకు ఈ కుతూహలం కాస్త ఎక్కువగానే ఉంటుందనుకోండి. వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజా ఇంటర్వ్యూలో తన డైట్ సీక్రెట్‌లను రివీల్ చేసింది ఈ బ్యూటీ. అవేంటో తెలుసుకుని మీరూ ఫాలో అయిపోండి.

    whey protein(వే ప్రొటీన్)కు ప్రాముఖ్యత:

    సింధు ఎప్పుడూ తన ఆహారంలో ప్రొటీన్ ను సమతుల్యంగా తీసుకోవడంపై దృష్టి పెడుతుందట. తనకు తగినంత ప్రోటీన్ దొరకనప్పుడు వే ప్రొటీన్(whey protein)ను ఉపయోగిస్తుందని తెలిపింది. వే ప్రొటీన్ అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది, అలాగే శరీరం దీన్ని సులభంగా గ్రహించగలదని కూడా ఆమె చెప్పుకొచ్చింది.

    పీవీ సింధు రోజూ ఎలాంటి ఆహారాలను తీసుకుంటుంది?

    తన డైలీ మీల్ ప్లాన్ గురించి సింధు మాట్లాడుతూ “నేను ఉదయం శిక్షణ తీసుకుంటాను, కాబట్టి ఉదయం భోజనంలో రెండు నుండి మూడు గుడ్లు తింటాను. వేరైవరైనా ఒకటి మాత్రమే తింటారు.

    మధ్యాహ్న భోజనంలో సలాడ్, మంచి మోతాదులో పప్పు, పనీర్ లేదా కూరగాయల కూర, ప్రధానంగా ఆకుకూరలతో పాటు చాలా తక్కువ అన్నం, పెరుగు తింటాను.

    నా రాత్రి భోజనం మధ్యాహ్న భోజనంలాగే ఉంటుంది, కానీ నేను ఈ సమయంలో ప్రోటీన్‌ను చికెన్‌ రూపంలోకి మార్చుకుంటాను.

    కొన్నిసార్లు, నేను ప్రయాణం చేస్తున్నా లేదా నా వ్యాయామ సెషన్‌లో ఉన్నా, నాకు ఆహారం నుండి తగినంత ప్రోటీన్ దొరకదు. ఇటువంటి సమయాల్లో నేను నా ప్రొటీన్ పౌడర్, ప్రోటీన్ డ్రింక్‌లపై ఆధారపడతాను. కొన్నిసార్లు నేను మధ్యలో స్నాక్‌గా పెరుగులో ప్రోటీన్ పౌడర్ చల్లుకుని తీసుకుంటాను.” అని తెలిపారు.

    ఎలాంటి ప్రొటీన్లను తీసుకుంటారు?

    పీవీ సింధు పప్పు, పనీర్, ఆకుకూరలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను కార్బోహైడ్రేట్ల కంటే ముఖ్యమైనవిగా పరిగణించాలని సూచించింది. అలాగే మనం తినే ఆహారంలో జొన్నలు, ఇడ్లీలు, దోసెలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చాలని సూచించింది.

    “నేను జంతు ప్రోటీన్ తింటాను కానీ దీన్ని తినని వారు కార్బోహైడ్రేట్లను నాలుగో వంతు కంటే తక్కువగా తీసుకుంటూ, ఎక్కువ రకాల మొక్కల ప్రోటీన్‌ను తీసుకోవాలి. అయినప్పటికీ ప్రోటీన్ సరిపోదు అనిపిస్తే వే ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు. మా అమ్మ వివిధ రకాల పప్పులను కూరగాయలతో కలుపి వంట చేస్తుంది. పప్పులతో ఇడ్లీ, దోసె బ్యాటర్లలో ప్రోటీన్లను చాలా సులభంగా కలపవచ్చు. ఏదైనా జొన్న బ్యాటర్, రాగి బ్యాటర్ వంటివి, ప్లాంట్ ప్రోటీన్‌లకు మంచి మూలం.” ప్రోటీన్ లీన్ కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందని, బరువు తగ్గడంలో సహాయపడుతుందని సింధూ చెప్పింది.

    పీవీ సింధు మీల్ ప్లాన్, ప్రొటీన్ చిట్కాలను అనుసరించడం ద్వారా, మీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం, ద్వారా మీ మొత్తం ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించవచ్చు.

    గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

    Ramya Sri Marka

    eMail

    మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.


    Kids Acne Diet: 8-14 ఏళ్ల వయసులోనే మీ పిల్లలకు మొటిమలు వస్తున్నాయా?  వెంటనే వారి డైట్లొ నుంచి ఈ పదార్థాలను తీసేయండి!

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال