No results found

    Summer food for Kids: వేసవిలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, ఇవి తప్పక తినిపించాలి! ఏయే ఆహారపదార్థాల వల్ల ఏం లాభాలో తెలుసా?

     

    Summer food for Kids: వేసవిలో పిల్లలను చురుకుగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి. అదీ కాకుండా వాతావరణంలో కలిగే మార్పులను తట్టుకోవడానికి వారికి కాస్త ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ ఉండాలి. భోజనం, సీజనల్ పండ్లు, కూరగాయలు ఇలా వేటి వల్ల ఏం బెనిఫిట్ ఉంటుందో తెలుసుకుందాం.

    పిల్లల కోసం ఆరోగ్యకరమైన ఆహారం
    పిల్లల కోసం ఆరోగ్యకరమైన ఆహారం

    పిల్లలకు బోలెడు సెలవులు తెచ్చిపెట్టే వేసవి కాలం అంటే చాలా ఇష్టం. దీని కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు. తమ స్నేహితులు, బంధువులతో కలిసి ఆటలు ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. ఒక్కోసారి ఆటల్లో మునిగిపోయి భోజనం కూడా మరిచిపోతుంటారు. వీలైనంతగా ఆరుబయటే సమయం గడపడానికే ఇష్టపడే పిల్లలు ఆహారం తీసుకోకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారి సరదాలను, సంతోషాలను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. దీని కోసం వారి ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

    శారీరక కార్యకలాపాల సమయం కాబట్టి, వేసవి ఉష్ణోగ్రతను తట్టుకునేలా చూసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండే ఆహారం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. డీహైడ్రేషన్ వల్ల కలిగే జీర్ణ సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది. తాజా, పోషకాలతో నిండిన, చల్లబరిచే ఆహారాలను ఆహారంలో చేర్చడం ద్వారా, పిల్లలు వేసవి అంతా ఆరోగ్యంగా, చురుకుగా, ఉల్లాసంగా గడుపుతారు.

    హైడ్రేటెడ్‌గా ఉంచే ఆహారం

    పిల్లలు తగినంత నీరు త్రాగేలా ప్రోత్సహించండి. (రోజుకు కనీసం 8 గ్లాసులు). షుగర్ బెండ్ సోడా, కూల్ డ్రింక్స్ బదులుగా మజ్జిగ, నిమ్మరసం, లస్సీ లేదా ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలను త్రాగేలా చూడండి. కర్బూజ, దోసకాయలు, నారింజలు వంటి నీటితో నిండిన ఆహారాలు వారిని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడతాయి.

    సీజనల్ పండ్లు, కూరగాయలు

    పండ్లు: కర్బూజ, ఖర్బూజ, మామిడిపండ్లు (మోతాదుగా), బొప్పాయి, నారింజ, స్ట్రాబెర్రీలు, అరటిపండ్లు.

    కూరగాయలు: దోసకాయలు, టమాటోలు, పాలకూర, క్యారెట్లు, బీట్‌రూట్, సొరకాయ

    తాజా పండ్లను ఉపయోగించి సలాడ్లు, స్మూతీలు తయారు చేసి ఇవ్వవచ్చు.

    లేత, పోషకాహారం

    ఉదయం తినేది: టీ, కాఫీలకు బదులుగా ఉదయం తినే వాటితో పాటు పండ్ల స్మూతీలు ఉంచండి.

    మధ్యాహ్న భోజనం: కూరగాయల సాంబారుతో పాటుగా పెరుగు, మజ్జిగ చేర్చండి.

    రాత్రి భోజనం: రోజువారీ భోజనంతో పాటు వీలైతే కూరగాయల సూప్ లేదా సలాడ్ జోడించండి.

    ప్రోబయోటిక్స్ కోసం గట్ ఆరోగ్యం

    రోజువారీ ఆహారంలో పెరుగు, మజ్జిగ, లస్సీని చేర్చండి. ఈ ప్రోబయోటిక్స్ నిండిన ఆహారాలు వేడి వాతావరణంలో కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడతాయి.

    గమనించాల్సిన విషయాలు:

    • ఇంట్లో పెరుగు ఆధారిత స్మూతీలు లేదా లస్సీ ఇవ్వవచ్చు. తాజా పండ్ల మిశ్రమం ఉన్న ఫ్రూటీ ఇవ్వవచ్చు.
    • శక్తిని పెంచడానికి డ్రై ఫ్రూట్స్ లేదా వాటితో తయారుచేసిన తినేవి ఇవ్వండి.
    • అనారోగ్యకరమైన ఆహారాలైన ఫ్రైడ్ ఐటెంలు, ప్యాక్ చేసిన చిప్స్, రుచులతో కూడిన పానీయాలు, అధికంగా ఐస్ క్రీం ఇవ్వడం మానుకోండి.
    • వీటికి బదులుగా షుగర్ ఉన్న స్వీట్లను, ఖర్జూరం లేదా తేనె వంటి వాటితో భర్తీ చేయండి.
    • వేసవిలో మాంసాహారం తినడం వల్ల అరుగుదలలో సమస్యలు కలుగుతాయి. వేడికి ఒక్కోసారి మాంసం త్వరగా పాడవుతుంది. అందులో ఏర్పడిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.

    గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

    Ramya Sri Marka

    eMail

    మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.


    మెగ్నీషియం ఉండే ఈ ఆహారం తీసుకుంటే అనేక వ్యాధులకు చెక్ పెట్టినట్టే

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال